Jammu And Kashmir: మే నెలలో తప్పిపోయిన ఐపీఎస్ అధికారి సోదరుడు... ఉగ్రవాదిగా మారి షాకిచ్చాడు!

  • శ్రీనగర్ లో డిగ్రీ చదువుతున్న షంసుల్ హక్
  • మే 25న హిజ్బుల్ ముజాహిద్దీన్ లో చేరిక
  • బుర్హన్ వనీ కోడ్ నేమ్ తో వెలుగులోకి

జమ్మూ కశ్మీర్ లో ఓ ఐపీఎస్ అధికారి సోదరుడు ఉగ్రవాదిగా మారిపోయి షాకిచ్చాడు. శ్రీనగర్ శివార్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న 2012 ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఇనాముల్ హక్ సోదరుడు షంసుల్ హక్ (25) గత మేలో అదృశ్యమయ్యాడు. అతను ఉగ్రవాదుల్లో చేరి వుండవచ్చని అనుమానిస్తున్నంతలోనే, హిజ్బుల్ ముజాహిద్దీన్ లో సభ్యుడిగా మారినట్టు తెలిసింది. ఆ సంస్థ తమ సభ్యుల ఫొటోలను విడుదల చేయగా, అందులో షంసుల్ కూడా ఉన్నాడు. మే 25న ఆయన మిలిటెంట్ గా మారాడని, అతనికి బుర్హాన్ వనీ అని కోడ్ నేమ్ ను ఇచ్చారని హిజ్బుల్ వర్గాల ద్వారా సమాచారం అందింది.

Jammu And Kashmir
Militent
Terrorist
IPS
Hizbul Muzahiddeen
  • Loading...

More Telugu News