Andhra Pradesh: పెళ్లి కొడుకు ఇంటికి పోస్టల్ కవర్.. విప్పి చూసి పెళ్లి రద్దు చేసుకున్న వరుడు!

  • స్పీడ్ పోస్టులో మొబైల్
  • అందులో పెళ్లి కుమార్తె వీడియోలు
  • పెళ్లి చేసుకునేది లేదన్న వరుడు

స్పీడ్ పోస్టులో వచ్చిన ఓ కవర్ విప్పి చూసిన వరుడు.. తెల్లారితే జరగనున్న పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడిలో జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక యువతికి, ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన యువకుడి‌తో పెళ్లి నిశ్చయమైంది. శనివారం వీరి వివాహం జరగాల్సి ఉంది. కొత్తలంకలో వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతలోనే శుక్రవారం అంటే పెళ్లికి ఒక్కరోజు ముందు పెళ్లి కొడుకు ఇంటికి కాకినాడ నుంచి కొరియర్‌లో ఓ కవర్ వచ్చింది. అందులో మొబైల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్‌లోని వీడియోలు ప్లే చేసి చూడాలని రాసి ఉండడంతో అలాగే చేసిన వరుడు షాక్‌కు గురయ్యాడు.

ఆ వీడియోల్లో వధువు స్నానం చేసిన అనంతరం దుస్తులు మార్చుకుంటున్నట్టు ఉంది. కాబోయే భార్య నగ్న దృశ్యాలను చూసిన వరుడు పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ వీడియోల్లో ఉన్నవి మార్ఫింగ్ చేసిన దృశ్యాలని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొరియర్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News