Punjab: పోలీసు స్టేషన్లో డ్రగ్స్ తీసుకుంటున్న కొత్త పెళ్లికూతురు... వైరల్ అవుతున్న వీడియో!

  • చేతులకు పెళ్లి గాజులతో యువతి
  • దర్జాగా కూర్చుని 'చిట్టా' పీలుస్తున్న వైనం
  • పంజాబ్ పోలీసులపై వెల్లువెత్తుతున్న విమర్శలు

పంజాబ్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో రికార్డు చేసినట్టుగా చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త పెళ్లికూతురు 'చిట్టా' (సింథటిక్ డ్రగ్స్) తీసుకుంటోంది. ఓ కొవ్వొత్తి ముందు వెడ్డింగ్ బ్యాంగిల్స్ ధరించి కూర్చున్న ఓ యువతి, ఫాయిల్ పేపర్ పై 'చిట్టా' వేసి దానికి కొవ్వొత్తి వేడిని చూపించి, పీల్చుతూ మత్తులోకి వెళుతోంది. హెరాయిన్, ఎల్ఎస్డీ (లైసర్జిక్ యాసిడ్ డైథెలమైడ్, మెటామఫిటమైన్ తదితరాలను పంజాబ్ ప్రాంతంలో 'చిట్టా'గా పిలుస్తారు.

 ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసుల పాత్రపై విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోలో ఓ పోలీసు అధికారి, తాను జలంధర్ లో రైడ్ కు వెళుతున్నట్టు చెప్పిన గొంతు వినిపిస్తోంది. ఆమె ఓ బలమైన ఇనుప పెట్టెపై కూర్చుని ఉండగా, అటువంటి బాక్స్ లు పోలీసు స్టేషన్లలోనే సహజంగా కనిపిస్తుంటాయి. వాటిల్లో ఆయుధాలను దాచుతుంటారు. ఇటీవల ఫిరోజ్ పూర్ డీఎస్పీ, బలవంతంగా ఓ యువతికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ కాగా, పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News