Bigg Boss: బిగ్ బాస్-2... బాబు గోగినేనిలోని మరో కోణాన్ని చూపించిన నాని!

  • పైకి ఒకలా, లోపల మరోలా బాబు గోగినేని
  • తేజస్వి మాటలతో పడిపోయిన గోగినేని
  • బయటకు కనిపించని రెండో యాంగిల్ చూపిన నాని

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ రెండో సీజన్ మరింత ఆసక్తికరమైంది. హోస్ట్ నాని శనివారం నాడు కంటెస్టెంట్ లను ఇరుకున పెట్టాడు. ముఖ్యంగా తనను తాను బాస్ గా భావిస్తుండే బాబు గోగినేనిని అడ్డంగా బుక్ చేశాడు. ఇతరులను ప్రభావితం చేయగల బాబు, హౌస్ మేట్ తేజస్వి మాటలు విని దీప్తిని ఎలిమినేషన్ కు నామినేట్ చేశాడని చెప్పాడు.

హౌస్ లోని ఓ వ్యక్తి మాటలు నమ్మి మరొకరిని ఎలా బయటకు పంపించి వేయాలని చూస్తారని అడగ్గా, టాపిక్ ను డైవర్ట్ చేయలేక బాబు గోగినేని నానా ఇబ్బందులూ పడాల్సి వచ్చింది. ఆయన్ను అంతటితో వదల్లేదు. కెప్టెన్ కౌశల్ గురించి తేజస్వి, భానులతో కలసి బాబు గోగినేని వేసిన జోకుల వీడియోను చూపించి, అందరినీ నిర్ఘాంత పరిచాడు నాని. బయటకు కౌశల్ తో సన్నిహితంగా ఉంటూ, అతను లేనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటాన్ని నలుగురికీ చూపించాడు.

Bigg Boss
Tollywood
Nani
Babu Gogineni
  • Loading...

More Telugu News