Nimmakayala Chinarajappa: కుట్రలు మీవి.. గెలుపు మాది: నిమ్మకాయల చిన రాజప్ప

  • బీజేపీ డైరెక్షన్.. వైసీపీ, జనసేన యాక్షన్
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం
  • తిరుమల పవిత్రతను బాబు కాపాడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొద్దిసేపటి క్రితం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.

 బీజేపీ దర్శకత్వంలో వైసీపీ, జనసేనలు నటిస్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. తిరుమల కేంద్రంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను ఆవేదనకు గురిచేశాయన్నారు. అలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బ తీసేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తిరుమల పవిత్రతను కాపాడుతున్నారని మంత్రి కొనియాడారు.

Nimmakayala Chinarajappa
Telugudesam
TTD
Jana Sena
YSRCP
  • Loading...

More Telugu News