Vizianagaram: వందేళ్ల క్రితం మునిగిన ఓడ.. చింతపల్లి తీరంలో కనుగొన్న స్కూబా డైవర్లు

  • ‌స్కూబా డైవింగ్‌పై చింతపల్లి తీరంలో పరిశోధన
  • పరిశీలిస్తున్న లైవ్ ఇన్ ఎడ్వెంచర్ సంస్థ
  • సాగర గర్భంలో ఓడను కనుగొన్న డైవర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి తీరంలో వందేళ్ల నాటి ఓడ బయటపడింది. ‌స్కూబా డైవింగ్‌కు చింతపల్లి తీరం అనువైనదా? కాదా? అన్న విషయాన్ని తేల్చేందుకు గత కొంతకాలంగా విశాఖపట్టణానికి చెందిన లైవ్ ఇన్ ఎడ్వెంచర్ సంస్థ పరిశీలిస్తోంది. అందులో భాగంగా స్కూబా డైవర్లు ఇక్కడ ట్రైల్స్ వేస్తున్నారు. స్కూబా డైవింగ్ ద్వారా సాగర గర్భంలోని వింతలు, విశేషాలను అతి సమీపం నుంచి చూసే వీలు చిక్కుతుంది. తాజాగా సాగర గర్భంలోకి వెళ్లిన స్కూబా డైవర్లు వందేళ్ల క్రితం మునిగిపోయినట్టు భావిస్తున్న ఓ ఓడ జాడను కనుగొన్నారు.

Vizianagaram
Chintapalli
Andhra Pradesh
Ship
  • Loading...

More Telugu News