Narendra Modi: నల్లదుస్తులు ధరించిన వారిని మోదీ సభకు అనుమతించని పోలీసులు

  • జైపూర్ బహిరంగసభలో పాల్గొన్న మోదీ
  • నల్ల జెండాలతో నిరసన తెలిపే అవకాశం ఉందన్న నిఘా విభాగం
  • పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం

ప్రధాని మోదీ జైపూర్ సభ సందర్భంగా రాజస్థాన్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. నల్ల రంగు దుస్తులు ధరించి సభకు వచ్చినవారిని సభాప్రాంగణంలోకి అనుమతించకుండా వెనక్కి పంపిచేశారు. ప్రధాని సభలో కొందరు నల్ల జెండాలతో నిరసన తెలిపే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు వారు చర్యలు తీసుకున్నారు. పోలీసుల తీరుపై నల్ల దుస్తులు ధరించి వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Narendra Modi
jaipur
black dress
  • Loading...

More Telugu News