Chandrababu: చంద్రబాబుకు ఓట్ల భయం పట్టుకుంది: కన్నా లక్ష్మీనారాయణ

  • కడప జిల్లాలో పర్యటిస్తున్న కన్నా
  • రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు
  • గాలేరు - నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను ఇంకా పూర్తి చేయరే?

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి ఓట్ల భయం పట్టుకుందని, ఎన్నికల్లో ఓడిపోతే ఆయన చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని బీజేపీ నేతలపై నిందలు వేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు కడపకు చేరుకున్నారు.

తిరుపతి-రాజంపేట మీదుగా కడపకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తనకు రాయలసీమ ప్రజలు ఓట్లు వేయలేదనే కోపంతోనే ఇక్కడి అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డెబ్బై శాతం పూర్తయిన గాలేరు - నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను ఇంకా పూర్తిచేయడం లేదని, వాటి అంచనా వ్యయాలను ప్రతి ఏటా పెంచుకుంటూ పోతున్నారని, కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాగా, కన్నా పర్యటనను సీపీఐ నేతలు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారం మేర వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Chandrababu
kanna laxminarayana
  • Loading...

More Telugu News