amit shah: తమిళనాడుపై అమిత్ షా గురి.. 9న చెన్నైకు పయనం!

  • తమిళనాడుపై కన్నేసిన బీజేపీ
  • పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా
  • పోత్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు

దక్షిణాదిపై దండయాత్రే అని గతంలో ప్రకటించిన బీజేపీ... ఆ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాజకీయపరంగా అస్తవ్యస్తంగా ఉన్న తమిళనాడుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 9న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెన్నై వెళ్తున్నారు. పార్టీ నేతలతో సమావేశమై... దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు, తమతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ నేతలతో కూడా ఆయన భేటీ కానున్నారు.

అమిత్ షా రాక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవించబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి అమిత్ షా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలిపారు. బీజేపీ పని అయిపోయిందనే వార్తలకు ఆయన చెక్ పెట్టబోతున్నారని అన్నారు.

అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ తో బీజేపీ నడిపిస్తోందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. తూత్తుకుడిలో పోలీసు కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ... ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇంతవరకు కనీసం సంతాపం ప్రకటించలేదు. 

  • Loading...

More Telugu News