renu desai: ఎవరితో నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని అందుకే సీక్రెట్ గా వుంచాను: రేణు దేశాయ్

  • క్రితం ఏడాదే మళ్లీ పెళ్లి గురించి ప్రస్తావించాను 
  • చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది 
  • సీరియస్ గా తీసుకోకుండా ఉండలేకపోయాను  

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూవుంటారు. ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూస్తూనే .. మరాఠి చిత్రపరిశ్రమలో దర్శక నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. పవన్ నుంచి విడిపోయిన ఇంతకాలానికి మరో వ్యక్తితో ఇటీవలే ఆమె నిశ్చితార్థం జరిగింది. 'ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఎందుకు రహస్యంగా జరుపుకోవలసి వచ్చింది?' అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆమెకి ఎదురైంది.

అందుకు రేణు దేశాయ్ స్పందిస్తూ .. "క్రితం ఏడాదే నేను మళ్లీ పెళ్లి గురించిన ఆలోచనను వ్యక్తం చేశాను. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అనే విషయాన్ని మాత్రమే నేను చెబితే చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. 'నిన్ను చంపేస్తాము .. నీ కాబోయే భర్తను చంపేస్తాము' అంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలోని కామెంట్స్ ను పట్టించుకోవలసిన అవసరం లేదని చాలామంది చెప్పారు. కానీ అలా పట్టించుకోకుండా నేను ఉండలేకపోయాను. నాకు కాబోయే భర్తకు హాని కలగకూడదనే ఆయన ఎవరనేది నేను చెప్పలేదు. చిత్రపరిశ్రమకి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు .. పెళ్లి తరువాత ఆయన ఎవరనేది చెబుతాను" అంటూ స్పష్టం చేశారు. 

renu desai
swapna
  • Loading...

More Telugu News