KCR: బీసీ, ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాలు వెంటనే అమలు చేయాలి: సీఎం కేసీఆర్
- ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలను ప్రారంభించాలి
- మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం వీటిని అమలు చేయాలి
- సంబంధిత అధికారులకు కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణలో బీసీ, ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాలను వెంటనే అమలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో వివిధ అంశాలపై ఈరోజు సమీక్షించారు. నగర సమాఖ్యకు రూ.10 కోట్లు, రజక సమాఖ్యకు 30.84 కోట్లు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలను ప్రారంభించాలని, మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం ఈ కార్యక్రమాలు అమలు చేయనున్నట్టు చెప్పారు. లక్ష, రెండు లక్షల రూపాయలు విలువ చేసే యూనిట్లు మంజూరు చేయాలని, బ్యాంకులతో సంబంధం లేకుండా యూనిట్లు, ఆర్థిక సాయం మంజూరు చేయాలని ఆదేశించారు.