stock market: వారాంతాన్ని లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు

  • అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోయినప్పటికీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • ఒకానొక సమయంలో 200 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్
  • చివరకు 35,658 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో, మార్కెట్లు ప్రారంభమైన కాసేపటికే జోరందుకున్నాయి. ఒకానొక  సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 35,658కి పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్లు పుంజుకుని 10,773 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టెరిలైట్ టెక్నాలజీస్ (8.88%), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (8.41%), అదానీ పవర్ (6.73%), జైన్ ఇరిగేషన్ (6.32%), జేకే లక్ష్మి సిమెంట్స్ (6.09%).

టాప్ లూజర్స్:
హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటా కామ్ (-11.17%), డెన్ నెట్ వర్క్స్ (-7.36%), వక్రాంగీ (-4.95), క్వాలిటీ (-4.83%), అవంతి ఫీడ్స్ (-3.81%). 

  • Loading...

More Telugu News