dance: మరోసారి ‘డ్యాన్సింగ్ అంకుల్‌’ వీడియో వైరల్‌.. హుషారెత్తించేలా స్టెప్పులు

  • ఇటీవల డ్యాన్స్‌ చేసి ఫేమస్‌ అయిన సంజీవ్ శ్రీవాత్సవ
  • ఈ సారి బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ కింగ్‌ హృతిక్‌ రోషన్‌లా డ్యాన్స్‌
  • హృతిక్‌ రోషన్‌కు అంకితమిస్తున్నానని ట్వీట్‌

అచ్చం బాలీవుడ్‌ హీరో గోవిందాలా హుషారుగా డ్యాన్స్ చేసి ఆన్‌లైన్‌లో ఓవర్‌ నైట్‌ సెన్సేషన్‌ అయి 'డ్యాన్సింగ్‌ అంకుల్‌'గా పేరు తెచ్చుకున్న భోపాల్‌కు చెందిన సంజీవ్ శ్రీవాత్సవ తాజాగా మరోసారి డ్యాన్స్‌ చేసి అలరించారు. ఈ సారి బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ కింగ్‌ హృతిక్‌ రోషన్‌లా డ్యాన్స్‌ చేశారు. 'కహో నా ప్యార్‌ హై' అనే పాటకు హుషారెత్తించే స్టెప్పులు వేసి 'డ్యాన్స్‌ కే మహదేవ్‌ హృతిక్‌ రోషన్‌'కు అంకితమిస్తున్నానని పేర్కొన్న ఆయన.. తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.     

  • Loading...

More Telugu News