p gannavaram: మీ ఒక్కరి ఓట్లతో నేను గెలవలేదు: మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

  • అంబాజీపేట లంకవారిపేటలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం
  • కాలనీకి ఏం చేయకుండా.. ఎందుకు వచ్చారని నిలదీసిన మహిళలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం లంకవారిపేటలో పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పూలపర్తి నారాయణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ తలపెట్టిన గృహమస్తు కార్యక్రమంలో భాగంగా లంకవారిపేటకు వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక మహిళలు నిలదీశారు. తమ కాలనీకి రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాన్ని కల్పించకుండా, ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. వారికి ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు. దీంతో, మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరొక్కరు వేసిన ఓట్లతో తాను గెలవలేదంటూ ఫైర్ అయ్యారు. 

p gannavaram
mla
narayanamurthy
women
  • Loading...

More Telugu News