New Delhi: 11 మంది ముక్తిని పొందిన ఆ ఇంటిని ఆలయంగా మార్చండి... స్థానికుల డిమాండ్!

  • న్యూఢిల్లీలోని బురారీలో సామూహిక ఆత్మహత్యలు
  • ఖాళీ చేసి వెళుతున్న చుట్టుపక్కల వారు
  • ఇల్లు తమకు వద్దంటున్న బంధువులు

న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో కలకలం రేపిన 11 మంది ఆత్మహత్యల తరువాత, వారు ఉన్న ఇంటిని దేవాలయంగా మార్చాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. నారాయణ్ దేవి కుటుంబం ముక్తి కోసం ఈ పని చేశారని పోలీసులు భావిస్తుండగా, ఇప్పటికే ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతం ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేసి వుంచారు. దీన్ని తీసుకోవడానికి బంధువులు ఎవరూ ముందుకు రావడం లేదట. ఇక దీన్ని అమ్మాలన్నా కొనుగోలు చేసే వారు ఎవరూ ఉండరని అభిప్రాయపడుతున్న స్థానికులు కొందరు, దీన్ని ఆలయంగా మార్చాలని అంటున్నారు. ఇక, మృతులకు దగ్గరి బంధువైన కేతన్ నాగ్ పాల్, పానిపట్, చిత్తోర్ గఢ్ లో స్థిరపడిన నారాయణ్ దేవి కుమార్తె, కుమారుడు ఈ ఇల్లు తమకు వద్దని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

New Delhi
Burari
Mass Sucide
Temple
Locals
House
  • Loading...

More Telugu News