Hyderabad: శ్వేతా రెడ్డిని కిడ్నాప్ చేసి, ఆమె మృతికి కారణమైన భరత్ అరెస్ట్!

  • గత నెల 30న ఘటన
  • బైక్ పై నుంచి జారి పడిన శ్వేతారెడ్డి
  • పలు సెక్షన్ల కింద భరత్ పై కేసు

హైదరాబాద్ శివార్లలోని మల్కాపూర్ లో ఇంజనీరింగ్ పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న శ్వేతారెడ్డి అనే యువతిని కిడ్నాప్ చేసి, బైక్ పై ఎక్కించుకుని వెళుతుండగా, అదుపుతప్పి వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో నిందితుడు భరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ పై శ్వేతారెడ్డి పెనుగులాడగా, యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

గత నెల 30న ఈ ఘటన జరుగగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నిన్న మరణించగా, చౌటుప్పల్ లో భరత్ ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. భరత్ ను నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నామని, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు. 

Hyderabad
Police
Two Wheeler
Swetha Reddy
Bharat
Kidnap
Arrest
  • Loading...

More Telugu News