nayanatara: ఆసక్తిని రేపుతోన్న నయనతార 'కొలమావు కోకిల' ట్రైలర్

  • నెల్సన్ దర్శకత్వంలో నయనతార
  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

కథలో వైవిధ్యం .. పాత్రలో కొత్తదనం వుంటేనే అంగీకరిస్తూ నయనతార ముందుకు వెళుతోంది. ఈ కారణంగానే ఆమె ఖాతాలో సక్సెస్ లు వరుసగా చేరుతున్నాయి .. ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అలా తాజాగా ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న 'కొలమావు కోకిల' నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు.

ట్రైలర్ ను బట్టే కథ అంతా కూడా నయనతార చుట్టూనే తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. నయనతార లుక్ .. ఆమె నటన కొత్తగా .. ఆకట్టుకునేలా ఉన్నాయి. స్మగ్లింగ్ నేపథ్యం .. ఒక పల్లెటూరి యువతి జీవితంలో చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. నెల్సన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, త్వరలోనే తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.

nayanatara
sharanya
  • Error fetching data: Network response was not ok

More Telugu News