Karnataka: 'మీ కుమారస్వామి' సంగతేంటి?.. రాహుల్ ను ప్రశ్నిస్తున్న బీజేపీ!

  • కర్ణాటకలో పెరిగిన ఇంధన ధరలు
  • బడ్జెట్ లో ప్రతిపాదించిన కుమారస్వామి
  • విరుచుకుపడిన బీజేపీ

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజెల్ ధరలపై సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వేళ, బీజేపీ మండిపడింది. పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయని, కేంద్రం సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. రైతులకు రూ. 34 వేల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేసిన కుమారస్వామి సర్కారు, ఖజానాను తిరిగి నింపుకునేందుకు విద్యుత్, మద్యం ధరలను, ఇంధన పన్నులను పెంచిన సంగతి తెలిసిందే. తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా సుంకాల పెంపు నిర్ణయాన్ని కుమారస్వామి ప్రతిపాదించారు.

 దీనిపై స్పందించిన బీజేపీ, తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, "రాహుల్ గాంధీ 'ఫ్యూయల్ చాలెంజ్'ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. కనీసం ఆయన ప్రభుత్వం కూడా. ఇదే జరుగుతోంది" అని వ్యాఖ్యానించింది. ముందు కాంగ్రెస్ పార్టీ, తాను పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో 'పెట్రో' సుంకాలను తగ్గించి చూపించాలని ఎద్దేవా చేసింది. కాగా, ఇంధన ధరలను మే 30న ఒక్క పైసా మేరకు తగ్గించిన రోజున, రాహుల్ దీన్ని ఓ జోక్ గా అభివర్ణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News