Pawan Kalyan: ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఇలా ఉండేవాడిని!: ఫొటో పోస్ట్ చేసిన పవన్‌ కల్యాణ్‌

  • ఫొటోలో పవన్‌ సోదరీమణులు
  • సోదరులు చిరు, నాగబాబు
  • వైరల్‌ అవుతోన్న ఫొటో

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ తన చిన్ననాటి ఫొటో పోస్ట్ చేశారు. అందులో తన సోదరీమణులతో పాటు, సోదరులు మెగాస్టార్‌ చిరంజీవి, నిర్మాత, నటుడు నాగబాబు కూడా ఉన్నారు. ఆ ఫొటో దిగిన కాలంలో తాను ఏడో తరగతి చదువుతున్నానని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. తాను శ్వాసకోశ సంబంధిత వ్యాధి నుంచి అప్పుడే కోలుకున్నానని తెలిపారు. పవన్‌ పోస్ట్ చేసిన ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కాగా, ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు.         

  • Loading...

More Telugu News