chandrasekhar: తప్పుకున్న నితిన్ .. తెరపైకి నాని పేరు!

  • విభిన్నమైన కథా చిత్రాలు 
  • విలక్షణ దర్శకుడిగా పేరు 
  • తాజా ప్రాజెక్టుకు సన్నాహాలు  

తెలుగుకి సంబంధించి విభిన్న కథా చిత్రాల దర్శకుల జాబితాలో చంద్రశేఖర్ యేలేటి కూడా కనిపిస్తాడు. 'ఐతే' .. 'అనుకోకుండా ఒక రోజు' .. ' మనమంతా' సినిమాలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి. అలాంటి చంద్రశేఖర్ యేలేటి మరో విలక్షణమైన కథను సిద్ధం చేసుకుని .. మైత్రీ మూవీస్ బ్యానర్ పై చేయడానికి రెడీ అవుతున్నాడు.

ముందుగా ఆయన ఈ సినిమాను గోపీచంద్ తోను .. ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తోను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కారణమేదైనా ఆ తరువాత ఈ ప్రాజెక్టు వచ్చి నితిన్ దగ్గర ఆగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అనుకుంటూ ఉండగా ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను నాని చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చంద్రశేఖర్ యేలేటి చెప్పిన కథను నాని వినడం .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.   

  • Loading...

More Telugu News