Chandrababu: చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖ.. ప్రతివారం ఐదు ప్రశ్నలు సంధిస్తానన్న బీజేపీ నేత

  • 2014 ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు తొలగించారు?
  • ‘బ్రీఫ్డ్ మీ’ అనే మాటలు మీవి కావని చెప్పగలరా? 
  • జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయలేదా?

సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను చంద్రబాబుకు రాశారు. ఈ లేఖ ద్వారా ఐదు ప్రశ్నలు వేస్తున్నానని వాటికి ఆయన సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై ప్రతివారం చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు వేస్తానని..వాటికి సమాధానాలు చెప్పాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

- టీడీపీ వెబ్ సైట్ నుంచి 2014 ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు తొలగించారు?

- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు చేసిన తొలి వాగ్దానాలు అమలు చేశామని చెప్పగలరా?

- జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయాన్ని అంగీకరిస్తారా?

- విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల ద్వారా ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయో చెప్పగలరా?

- ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అనే మాటలు మీవి కావని చెప్పగలరా? 

  • Loading...

More Telugu News