Telangana: తెలంగాణ మంత్రి పద్మారావు, ఇతర టీఆర్ఎస్ నేతలపై కేసుల కొట్టివేత

  • 2014 లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు
  • పద్మారావుతో పాటు టీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసుల విచారణ
  • ఈ కేసులు కొట్టేసిన నాంపల్లిలోని జిల్లా మెట్రోపాలిటిన్ కోర్టు

తెలంగాణ రాష్ట్ర అబ్కారి, క్రీడల శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ తో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలపై గతంలో దాఖలైన ఎన్నికల కేసులను న్యాయస్థానం కొట్టి వేసింది. 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం సికింద్రాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్ధి టి.పద్మారావుతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసింది.  

రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం నాంపల్లిలోని జిల్లా కోర్టుకు పద్మారావు గౌడ్ తదితరులు ఈరోజు హాజరయ్యారు. కేసు పూర్వపరాలను విచారించిన జిల్లా మెట్రోపాలిటిన్ న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, టీఆర్ఎస్ నేతల పక్షాన న్యాయవాది సంతోష్ రెడ్డి కోర్టులో తమ వాదనలు వినిపించారు.

Telangana
minister padmarao
TRS leaders
  • Loading...

More Telugu News