step mother: సవతి తల్లిపై లైంగిక వేధింపులు.. అరెస్ట్

  • ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో దారుణం
  • నిద్రిస్తున్న సవతి తల్లిపై లైంగిక వేధింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

కామాంధులు వావివరసలు కూడా మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా సెద్ పుర గ్రామంలో తాజాగా మరో దారుణం సంభవించింది. 26 ఏళ్ల యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న సవతి తల్లి (36) గదిలోకి చొరబడి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాగిన మైకంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు తిత్వాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

step mother
sexual abuse
  • Loading...

More Telugu News