East Godavari District: తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురమ్మాయిల అదృశ్యం!

  • కడియంలో కలకలం రేపిన ఘటన
  • స్కూలుకు వెళ్లి తిరిగి రాని విద్యార్థినులు
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా కడియంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నిన్న స్కూలుకు వెళ్లిన వీరంతా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గత రాత్రి వీరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థినులు సునీత, సుమిత్ర, అనూషగా గుర్తించిన పోలీసులు వారు ఎటు వెళ్లారన్న విషయమై విచారణ ప్రారంభించారు. కడియం నుంచి రాజమండ్రి వైపు వీరు వెళ్లినట్టుగా భావిస్తున్న పోలీసులు, రాజమండ్రి బస్టాండు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

East Godavari District
Kadiyam
Missing
Girls
Police
  • Loading...

More Telugu News