Avanthi srinivas: విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ దీక్ష.. 9 గంటలకు ప్రారంభం

  • ఉదయం 9 గంటలకు దీక్ష ప్రారంభం
  • పాల్గొననున్న పలువురు ఎంపీలు, మంత్రులు
  • రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనన్న అవంతి

టీడీపీలో ఇప్పుడు దీక్షల పర్వం కొనసాగుతోంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇటీవల ఎంపీ సీఎం రమేష్ నిరాహార దీక్ష చేపట్టగా, నేడు ఆ పార్టీకే చెందిన మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ మరో దీక్ష చేపట్టనున్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖలో ఈ ఉదయం ఆయన దీక్షకు కూర్చోనున్నారు. ఉదయం 9 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

దీక్షలో కూర్చోనున్న అవంతి మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. రైల్వే జోన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయన్నారు. కేకే లైన్‌తో జోన్ కావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. దీక్షలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు కూడా కూర్చోనున్నారు.

Avanthi srinivas
Telugudesam
Andhra Pradesh
Visakhapatnam District
Railway zone
  • Loading...

More Telugu News