telangana: కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: కేంద్ర మంత్రి హన్సరాజ్

  • తెలంగాణలో రహదారుల నిర్మాణానికి భారీగా నిధులిచ్చాం
  • పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం
  • బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదని కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం అన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు ఇచ్చామని చెప్పారు. పంటలకు గిట్టు బాటు ధరలను ఇస్తున్నామని, ఎరువుల కొరతను కూడా నివారించామని తెలిపారు. దేశ భద్రతకు ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. కుటుంబ పాలనకు దేశంలో కాలం చెల్లిందని... 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెడితే... తెలంగాణను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈరోజు మంచిర్యాలలో బీజేపీ బహిరంగసభను నిర్వహించింది. ఈ సందర్భంగా హన్సరాజ్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 

telangana
hansraj gangaram
TRS
bjp
  • Loading...

More Telugu News