Chandrababu: టీడీపీలోకి అశోక్ బాబు ఎప్పుడు వచ్చినా సముచిత స్థానం కల్పిస్తాం: చంద్రబాబు
- విభజన సమయంలో ఎన్జీవోలు తీవ్రస్థాయిలో పోరాడారు
- అదే విధంగా ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు
- అశోక్‌బాబు మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడు
టీడీపీలోకి ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు ఎప్పుడు వచ్చినా సముచిత స్థానం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఏలూరులో ఎన్జీవో హోమ్ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ... విభజన సమయంలో ఎన్జీవోలు తీవ్రస్థాయిలో పోరాటాలు చేశారని, అదే విధంగా ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అశోక్‌బాబు మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడని, ఆయన టీడీపీలో క్రియా శీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ పార్టీలోకి ఆయనను ఆహ్వానిస్తున్నానని అన్నారు.