kailash mansarovar: కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తూర్పుగోదావరి వాసి మృతి

  • తీవ్రమైన మంచు వర్షంతో ఇబ్బందులు పడుతున్న యాత్రికులు
  • తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గ్రంథి సుబ్బారావు మృతి
  • పోస్టు మార్టం తర్వాత ఇండియాకు తరలింపు

తీవ్రమైన మంచు వర్షం ప్రభావంతో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వేలాది మంది యాత్రికులు నేపాల్ లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో తెలుగువారు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ చిక్కుకుపోయిన తమ వారి కోసం ఇక్కడున్న కుటుంబసభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గ్రంథి సుబ్బారావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. నేపాల్ లోని హిల్సాలో ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. అక్కడే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారని, ఆ తర్వాత భౌతికకాయాన్ని ఏపీకి తరలిస్తారని తెలిపింది. 

kailash mansarovar
telugu man
dead
  • Loading...

More Telugu News