mithun chakraborty: మిథున్ చక్రవర్తి కుమారుడిపై చీటింగ్, అత్యాచారం కేసు.. యువతి ఫిర్యాదుతో కోర్టు ఆదేశం!

  • మహాక్షయ్ తనపై అత్యాచారం చేశాడంటూ కోర్టుకెక్కిన యువతి
  • అతడి వల్ల గర్భం కూడా దాల్చానని కోర్టుకు తెలిపిన బాధితురాలు
  • కేసులు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశం

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్, ఆయన భార్య యోగితా బాలిపై చీటింగ్, అత్యాచారం కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. పెళ్లి పేరుతో మహాక్షయ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాధిత యువతి ఢిల్లీలోని రోహిణి కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు వారిద్దరిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

బాధిత యువతి కోర్టుకు సమర్పించిన పిటిషన్ ప్రకారం.. మూడేళ్ల నుంచి బాధిత యువతితో మహాక్షయ్‌కు సంబంధం ఉంది. ఇద్దరూ నిత్యం ఫోన్, చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓసారి మహాక్షయ్ తన ఫ్లాట్‌కు రావాల్సిందిగా యువతిని కోరాడు. వెళ్లిన ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి పేరుతో పలుమార్లు ఆమెను బలవంతం చేశాడు. ఈ క్రమంలో గర్భవతి అయిన యువతికి గర్భనిరోధక మందులు ఇవ్వడంతో అబార్షన్ అయింది.
 
మహాక్షయ్ తల్లి యోగితా బాలిని ఈ కేసులోకి లాగడంపై యువతి స్పందిస్తూ.. యోగిత తనకు ఫోన్ చేసి పలుమార్లు బెదిరించారని, తన కోడలు కావాలన్న ఆశలు ఏవైనా ఉంటే తుంచేసుకోవాలని బెదిరించారని యువతి ఆరోపించింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి అత్యాచారానికి పాల్పడినందుకే కోర్టుకెక్కినట్టు యువతి పేర్కొంది.

mithun chakraborty
Mahakshay
Bollywood
Rape case
Yogeeta bali
  • Loading...

More Telugu News