Ayyanna Patrudu: వచ్చే ఎన్నికల్లో టీడీపీలో యువతకు ప్రాధాన్యమివ్వాలి: ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు

  • పార్టీ కోసం అవసరమైతే సీనియర్లు త్యాగం చేయాలి
  • రాజకీయాల్లో వారసులు ప్రతిభ నిరూపించుకోవాలి
  • పార్టీ పరిరక్షణ కోసమే నేను ముక్కు సూటిగా మాట్లాడతా
  • మంత్రి గంటాతో సిద్ధాంతపరమైన విభేదాలే

వచ్చే ఎన్నికల్లో టీడీపీలో యువతకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈరోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పార్టీ కోసం అవసరమైతే సీనియర్లు త్యాగం చేయాలని, అలాగే రాజకీయాల్లో వారసులు ఉంటే ఆ యువత ప్రతిభ నిరూపించుకోవాలని అన్నారు. నర్సీపట్నంలో తాను ఆరుసార్లు గెలిచానని, అధికారిక పనుల్లో తన అబ్బాయి జోక్యం ఉండదని అన్నారు.

ప్రతిభ ఆధారంగా తన కుమారుడికి టిక్కెట్టు ఇస్తే ఒప్పుకుంటానని అయ్యన్న పాత్రుడు అన్నారు. మళ్లీ యువతరానికి టీడీపీ పెద్ద పీట వేయాలని అన్నారు. పార్టీ పరిరక్షణ కోసమే తాను ముక్కు సూటిగా మాట్లాడతానని, మంత్రి గంటా శ్రీనివాసరావుతో సిద్ధాంతపరమైన విభేదాలే ఉన్నాయని, తనకు ఎవ్వరి మీదా కోపం లేదని అన్నారు.

కొన్ని వ్యవహారాల్లో విభేదాలు వస్తుంటాయని సరిదిద్దుకుంటామని అయ్యన్న పాత్రుడు చెప్పారు. తామిద్దరం పార్టీ కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఓ సీనియర్‌ నాయకుడిగా పార్టీలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే పార్టీ అధ్యక్షుడితో చెప్పి సరిదిద్దాల్సిన బాధ్యత తనకు ఉందని అన్నారు.          

  • Loading...

More Telugu News