Road Accident: నిర్మల్‌ జిల్లాలో టైరు పేలడంతో కారు ప్రమాదం.. ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మృతి!

  • విహార యాత్రకు ఏడుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు
  • పేలిన ఇన్నోవా వాహన టైరు 
  • డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన ఇన్నోవా

నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళుతోన్న ఏడుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల ఇన్నోవా వాహన టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొట్టింది. దీంతో వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా కుంటాల జలపాతాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో వాహనాన్ని నడుపుతోన్న దినేష్‌ (27), కుసుమ (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా,  శ్రీవిద్య అనే అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. మరో ముగ్గురు యుగేంధర్‌, నవీన్‌, నిఖిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  

Road Accident
Nirmal District
  • Error fetching data: Network response was not ok

More Telugu News