Casting Couch: ఇలాంటి వన్నీ కొత్త కంపెనీలలో వుంటాయి!: క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి ఆమని

  • నాకు తెలిసినంత వరకు అప్పట్లో లేదు
  • అయితే, కొత్త కంపెనీలో ఉంటాయి
  • సినిమాలు తీస్తారో తీయరో తెలియని కంపెనీలు చాలా ఉంటాయి
  • అలాంటి వాటిల్లో ఇలాంటివి జరుగుతుంటాయి

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి ఆమని స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది తనకు తెలిసినంతవరకు లేదని తెలిపారు. అయితే, కొన్ని కొత్త కంపెనీల్లో మాత్రం కొందరికి అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొత్తవారిని చూసి బాగున్నావని చెప్పి, సినిమాలో తీసుకుంటామని అనే వారని, తదుపరి రోజు ఫోన్‌ చేసి గెస్ట్‌హౌస్‌కు రండని, ఒకసారి మేకప్‌ టెస్ట్‌ చేస్తామని అనేవారని చెప్పారు.

గెస్ట్‌హౌస్‌ అనగానే ఆ విషయం అర్థమైపోయేదని, ఇలాంటివన్నీ కొత్త కంపెనీలలో ఉంటాయని ఆమని అన్నారు. సినిమాలు తీస్తారో తీయరో తెలియని కంపెనీలు చాలా ఉంటాయని, అలాంటి వాటిల్లో ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పారు. కానీ, ప్రొఫెషనల్‌ కంపెనీల్లో కనిపించవని పేర్కొన్నారు.

Casting Couch
amani
Tollywood
  • Loading...

More Telugu News