Vijayawada: చంద్రబాబును ఘనంగా సన్మానించిన హోమ్ గార్డులు

  • విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో సభ
  • హోమ్ గార్డులైనా, పోలీసులైనా ఒకటే
  • ఆత్మీయ సభలో చంద్రబాబునాయుడు

తమ వేతనాలను పెంచిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి హోమ్ గార్డులు సన్మానం చేశారు. ఈ ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో హోమ్ గార్డుల ఆత్మీయ సభ జరుగగా, చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. తన దృష్టిలో హోమ్ గార్డులైనా, పోలీసులైనా ఒకటేనని ఆయన అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా హోమ్ గార్డులు ఉన్నారని, ఇది తనకు సన్మాన సభ కాదని, హోమ్ గార్డుల చైతన్య సభ అని అభివర్ణించారు.

కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా హోమ్ గార్డుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఆర్థికంగా కుదుటపడితే మరింతగా హోమ్ గార్డులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడే దిశగా హోమ్ గార్డులు సైతం టెక్నాలజీని వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.

Vijayawada
Home Guards
Chandrababu
  • Loading...

More Telugu News