software engineer: అమెరికాలో జలపాతంలో పడి మృతి చెందిన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్

  • పదేళ్ల క్రితం ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన నాగార్జున
  • అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం
  • మరణవార్తతో విషాదంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు

అమెరికాలో మరో విషాదకర ఘటన సంభవించింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే వ్యక్తి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. నార్త్ కరోలినా ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లిన ఆయన... ప్రమాదవశాత్తు ఓ జలపాతంలో పడి దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని ఆయన మిత్రులు గొట్టెముక్కలలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. నాగార్జున మృతితో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఉన్నత చదువుల కోసం పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన నాగార్జున... అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అతని సోదరుడు యశ్వంత్ హైదరాబాదులో పని చేస్తున్నారు. చెల్లెలు పూజిత పెళ్లి చేసుకుని, విజయవాడలో నివాసం ఉంటున్నారు. తల్లి రాజేశ్వరి పూజిత వద్దే ఉంటున్నారు. నాగార్జున తండ్రి 7 సంవత్సరాల క్రితం మరణించారు.

software engineer
nargarjuna
america
died
  • Loading...

More Telugu News