suresh babu: ఎక్కడ ఏది జరిగినా సినీ పరిశ్రమకు లింక్ చేస్తున్నారు: సురేష్ బాబు ఆవేదన

  • ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు ఉంటాయి
  • చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనేది అవాస్తవం
  • సురేష్ ప్రొడక్షన్స్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది

సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెస్తున్నవారిని నియంత్రించడం అంత సులభం కాదని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ప్రతిభ ఉన్నవారందరికీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయని చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలపై ఇప్పటికే కమిటీ వేశామని తెలిపారు. ఎక్కడ ఏది జరిగినా దానికి సినీపరిశ్రమనే భాధ్యురాలిగా చేయడం దారుణమని అన్నారు. ఎక్కడో అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడినా... దానికి, టాలీవుడ్ కు లింక్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా తమకు తెలియదని అన్నారు.

ఇక చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనేది తప్పుడు ప్రచారమని అన్నారు. మంచి సినిమాకు కచ్చితంగా థియేటర్లు దొరుకుతాయని చెప్పారు. 50 ఏళ్ల సురేష్ ప్రొడక్షన్స్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. కేవలం గొప్ప చిత్రాల నిర్మాణమే కాకుండా, సంస్థ పది కాలాల పాటు కొనసాగేలా కూడా చిత్ర నిర్మాణం ఉండాలని అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ, సురేష్ బాబు ఈ మేరకు స్పందించారు.

suresh babu
suresh productions
tollywood
  • Loading...

More Telugu News