nutan nayudu: పవన్ తో ఎప్పటి నుంచో పరిచయం ఉంది.. పిచ్చాపాటిగా మాట్లాడుకునే వాళ్లం: బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు

  • సత్యానంద్ వద్ద పవన్ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి పరిచయం ఉంది
  • పవన్ వ్యక్తిత్వాన్ని ఎంతో ఆరాధిస్తా
  • ప్రజారాజ్యంలో కలిసి పనిచేశాం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్ నూతన్ నాయుడు తెలిపారు. సత్యానంద్ దగ్గర పవన్ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి స్నేహం ఉందని చెప్పారు. పిచ్చాపాటిగా మాట్లాకునేవాళ్లమని తెలిపారు. ఆయనతో ఉండాలని, కలసి ప్రయాణించాలని అనుకునేవాడినని... పవన్ వ్యక్తిత్వాన్ని తాను ఎంతగానో ఆరాధించానని చెప్పారు.  ప్రజారాజ్యం పార్టీలో పవన్ తో కలిసి పని చేశానని... ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందని తెలిపారు. జనసేన స్థాపించిన తర్వాత తన స్నేహితులు చాలా మంది ఆ పార్టీతో కలసి పని చేస్తున్నారని చెప్పారు. తనకు మాత్రం ఇంకా ఆహ్వానం రాలేదని... కాకితో కబురు పంపినా ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తానని తెలిపారు.

nutan nayudu
Pawan Kalyan
friendship
janasena
  • Loading...

More Telugu News