delhi: ఢిల్లీలో భూప్రకంపనలు.. బెంబేలెత్తిపోయిన జనాలు

  • సోనేపట్ లో భూకంప కేంద్రం
  • నేషనల్ క్యాపిటల్ రీజన్ ను వణికించిన ప్రకంపనలు
  • మధ్యాహ్నం 3.37 గంటలకు భూప్రకంపనలు

ఢిల్లీలో సంభవించిన భూప్రకంపనలతో జనాలు వణికిపోయారు. నేషనల్ క్యాపిటల్ రీజన్ (ఎన్సీఆర్) పరిధిలో కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. హర్యాణాలోని సోనేపట్ లో భూకంపం వచ్చిన కొన్ని క్షణాల్లోనే ఢిల్లీని ప్రకంపనలు వణికించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైంది.

ఎన్సీఆర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోనేపట్ లో మధ్యాహ్నం 3.37కి భూకంపం సంభవించింది. ప్రాణాపాయానికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి సమాచారం వెలువడలేదు. ప్రకంపనలు వచ్చిన వెంటనే ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్ లకు చెందిన పలువురు ట్విట్టర్ ద్వారా తమ అనుభవాలను పంచుకున్నారు.

delhi
earth quake
  • Loading...

More Telugu News