Andhra Pradesh: ఒకటవుతున్న వేలాది జంటలు... నేడు హైదరాబాద్ లో 50 వేల వివాహాలు!

  • తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి
  • నేడు మంచి ముహూర్తం
  • 15 నుంచి నెలరోజులు శుభకార్యాలు బంద్!

కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. నేడు మంచి ముహూర్తం ఉండటంతో వేలాది జంటలు ఒకటవుతున్నాయి. కల్యాణ మండపాల నుంచి అపార్టుమెంట్ల సెల్లార్లు, హోటళ్లలోని బంకెట్ హాల్స్ వరకూ వివాహ వేదికలుగా మారగా, వసతి దొరకని వారు వీధుల్లోనే పెళ్లి మండపాలను తయారు చేసుకున్నారు. నేడు ఒక్కరోజు హైదరాబాద్ లో దాదాపు 50 వేల వివాహాలు జరగనున్నాయని తెలుస్తోంది. జూలై 15 వరకూ ముహూర్తాలు ఉన్నప్పటికీ, నేడు అత్యంత శుభ ప్రదమైన దినమని పురోహితులు వ్యాఖ్యానించారు. జూలై 15 నుంచి ఆషాఢ మాసం రానుందని, ఆగస్టు 15 వరకూ ముహూర్తాలు లేవని, అందువల్లే వివాహాలన్నీ ఇప్పుడే జరుగుతున్నాయని తెలిపారు.

Andhra Pradesh
Telangana
Marriages
Hyderabad
  • Loading...

More Telugu News