Elur: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ బాలసుబ్బారావు కన్నుమూత

  • ఆయన వయసు 83 సంవత్సరాలు
  • ఎమ్మెల్సీగా, డీబీసీసీ చైర్మన్ గా పనిచేసిన బాలసుబ్బారావు
  • పీవీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరని ముద్ర

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎమ్మెల్సీగా, డీబీసీసీ చైర్మన్ గా కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం సేవలందించిన బాల సుబ్బారావు, మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో నమ్మకంగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వెలిబుచ్చారు.

Elur
Bala Subbarao
Died
Ex MP
  • Loading...

More Telugu News