Gas: మళ్లీ పెరిగిన ‌వంటగ్యాస్ ధర.. సిలిండర్‌కు రూ.2.71 పెంపు

  • రూపాయి విలువ పతనంతో పెరిగిన గ్యాస్ ధర
  • రాయితీ రహిత సిలిండర్‌పై రూ. 55.50
  • పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి

వంట గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు మరోమారు షాకిచ్చాయి. రాయితీ సిలిండర్‌ ధరను రూ. 2.71 పెంచినట్టు ప్రకటించాయి. పెరిగిన ధర ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానుంది. రూపాయి ధర పతనం కావడంతోపాటు, అంతర్జాతీయంగా ధరలు పెరగడం కూడా ఇందుకు ఒక కారణమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) పేర్కొంది. పెరిగిన ధరతో ఢిల్లీతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 493.55 అయింది.  

నిజానికి గత నెలలో విదేశీ మారకపు రేటు, సగటు బెంచ్ మార్క్ రేటు ఆధారంగా చమురు కంపెనీలు ప్రతినెలా ఒకటో తేదీన గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఇక, అంతర్జాతీయంగా ధరల్లో పెరుగుదల కారణంగా రాయితీ లేని సిలిండర్ ధరల రేట్లు కూడా పెరిగినట్టు ఐవోసీఎల్ తెలిపింది. దీంతో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ. 55.50 పెరిగింది.

Gas
cylinder
IOCL
New Delhi
  • Loading...

More Telugu News