Police: తమ కోచింగ్ సెంటర్లో మానేసి, మరో చోట చేరాడన్న కసితో.. ఓ టీచర్ ను చెట్టుకు కట్టేసి, కొట్టిన వైనం.. వీడియో వైరల్‌!

  • కోచింగ్‌ సెంటర్‌లో పనిచేసిన టీచర్‌ మయాధర్‌  
  • జీతం ఇవ్వకపోవడంతో పని మానేసిన టీచర్‌
  • దారిలో పట్టుకుని కొట్టిన కోచింగ్‌ సెంటర్‌ ఎండీ
  • ఒడిశాలోని నయాగఢ్‌ జిల్లాలో ఘటన

నోటికి గుడ్డ కట్టి.. చెట్టుకు కట్టేసి.. చెప్పుల దండవేసి.. ఓ టీచర్‌ను కొందరు కొట్టిన వీడియో వైరల్‌ అవుతోంది. ఒడిశాలోని నయాగఢ్‌ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వివరాలు తెలిపారు. అక్కడి సత్యసాయి కోచింగ్‌ సెంటర్‌లో మయాధర్‌ మహాపాత్ర అనే వ్యక్తి ఇంగ్లిష్‌ టీచర్‌గా పని చేశాడు.

అయితే, ఆ కోచింగ్‌ సెంటర్‌ ఎండీ వేతనం ఇవ్వకపోవడంతో ఆ జాబ్‌ మానేసి, మరో కోచింగ్‌ సెంటర్‌లో జాబ్‌లో చేరాడు. ఈయన లేకపోవడంతో సత్యసాయి కోచింగ్‌ సెంటర్‌ సరిగ్గా నడవలేదు. దీంతో అతడిపై ఎండీ తపన్‌ పగ పెంచుకుని మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఓ యువకుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.                                                                                                                         

  • Loading...

More Telugu News