Earth Quake: నెల్లూరులో స్వల్ప భూకంపం!

  • గత రాత్రి ప్రకంపనలు
  • ఆందోళనలో ప్రజలు
  • రాత్రంతా రోడ్లపైనే

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమి కంపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనతో రోడ్లపైకి వచ్చి రాత్రంతా భయంతో గడిపారు. జిల్లా పరిధిలోని బోగోలు మండలంలో రెండు సెకన్ల నుంచి మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం భూకంపం జోన్ లో ఉందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు నమోదవుతుండటంతో, ఎప్పుడు పెద్ద భూకంపం వస్తుందోనని ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. తాజా ప్రకంపనలపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Earth Quake
Nellore District
Bogolu
  • Loading...

More Telugu News