Chandrababu: మరింత విషమించిన సీఎం రమేష్ ఆరోగ్యం... కడపకు బయలుదేరిన చంద్రబాబు, లోకేష్

  • 10వ రోజుకు చేరిన సీఎం రమేష్ దీక్ష
  • పడిపోయిన షుగర్ లెవల్స్
  • ప్రాణాలకు ప్రమాదమని వైద్యుల హెచ్చరిక
  • సీఎం రమేష్ దీక్షకు సంఘీభావం తెలపనున్న చంద్రబాబు

కడపలో ఉక్కు పరిశ్రమను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు దిగిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆయన దీక్ష 10వ రోజుకు చేరింది. గత పది రోజులుగా ఎటువంటి ఆహారాన్ని ఆయన తీసుకోకపోవడంతో పలు అవయవాల పనితీరు మందగించిందని, షుగర్ లెవల్స్ పడిపోయాయని, రక్తపోటు కనీస స్థాయికి చేరిందని, వెంటనే ఆసుపత్రికి తరలించకుంటే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఈ మేరకు తాజా నివేదికను ఉన్నతాధికారులకు అందించారు.

సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్న చంద్రబాబునాయుడు, ఈ ఉదయం తన కుమారుడు లోకేష్ తో కలసి కడపకు బయలుదేరారు. సీఎం రమేష్ దీక్షకు సంఘీభావం తెలపనున్న చంద్రబాబు, ఆయన్ను దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, నేడు రమేష్ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తనను బలవంతంగా ఆసుపత్రికి తరలించినా, దీక్షను కొనసాగిస్తానని సీఎం రమేష్ స్పష్టం చేస్తున్నారు.

Chandrababu
CM Ramesh
Nara Lokesh
Hunger Strike
  • Loading...

More Telugu News