strike: ప్రేమించి మోసం చేసిన అమ్మాయి.. న్యాయం చేయాలంటూ ఆమె ఇంటి ముందు అబ్బాయి ధర్నా!

  • నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌లో ఘటన
  • కన్నీరు పెట్టుకున్న ప్రియుడు
  • తనతో అమ్మాయి ఫొటోలు కూడా దిగిందన్న యువకుడు

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రియురాలు తనను మోసం చేసిందంటూ ఓ యువకుడు ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌లో చోటు చేసుకుంది. దీంతో స్థానికులందరూ అతడికి జరిగిన మోసం గురించి ఆరా తీయగా ఆ యువకుడు తమ ప్రేమాయణం గురించి చెప్పాడు.

తన ప్రియురాలు తనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిందని, చివరికి మొహం చాటేసిందని చెబుతూ ఆమెతో గతంలో దిగిన ఫొటోలను చూపిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రియురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్నాకు దిగిన ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.                                                                                        

  • Loading...

More Telugu News