Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

  • కమ్ముకున్న మేఘాలు
  • మలక్‌పేట, చాదర్‌ఘాట్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం 
  • పలు ప్రాంతాల్లో చిరుజల్లులు

హైదరాబాద్‌లో మేఘాలు కమ్ముకుని చల్లని వాతావరణం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. మలక్‌పేట, చాదర్‌ఘాట్‌, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, సోమాజిగూడ, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్, రామంతాపూర్, పెద్దంబర్‌పేట్‌, హబ్సిగూడ, తార్నాకతో పాటు జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్ లో చిరుజల్లులు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం పడుతోంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.                       

  • Loading...

More Telugu News