kcr: దేవుళ్లకు మొక్కులు సరే, మాకిచ్చిన హామీల సంగతేంటి?: కేసీఆర్ కు వీహెచ్ సూటిప్రశ్న

  • ప్రజలకిచ్చిన హామీలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు
  • పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ కు ఉందా? లేదా?
  • పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమారే కొనసాగుతారు

‘దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నావ్ సరే, మరి మాకు ఇచ్చిన హామీలు అమలు చేయవా?’ అని సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొక్కులు తీర్చుకుంటున్న కేసీఆర్, ప్రజలకిచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. అసలు ఈ ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ కు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమారే కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా చెప్పారని అన్నారు. పార్టీలో ఇంకా కొందరు రహస్య సమావేశాలు పెడుతున్నారని, ఈ విషయమై కుంతియాకు ఫిర్యాదు చేస్తానని, రహస్య సమావేశాల వెనుకున్న కుట్రదారుడు ఎవరో బయటకు రావాలని, పార్టీలో ఇలాంటి చర్యలు సరికాదని అన్నారు.

  • Loading...

More Telugu News