somu veerraju: చంద్రబాబు అడిగితే మాత్రం రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఇచ్చేదిలేదు!: సోము వీర్రాజు

  • సుజనా చౌదరి తెర వెనక్కి ఎందుకెళ్లారో చంద్రబాబు చెప్పాలి
  • కడపలో మూతబడ్డ ఫ్యాక్టరీలను సీఎం రమేష్ ఎందుకు తెరిపించ లేదు
  • షేర్ల పేరుతో ప్రజలను కుటుంబరావు మోసం చేశారు

విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ కు బీజేపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే మాత్రం తాము ఇవ్వమని చెప్పారు. ఎంపీ సుజనా చౌదరి తెర వెనక్కి ఎందుకు వెళ్లారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

 కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్... కడపలో మూతబడ్డ ఫ్యాక్టరీలను ఎందుకు తెరిపించడం లేదని ప్రశ్నించారు. షేర్ల పేరుతో ఏళ్ల తరబడి ప్రజలను మోసం చేసిన కుటుంబరావు... ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోతున్న డీజీపీ మాలకొండయ్య... టీడీపీ గౌరవ అధ్యక్షుడిగా మారిపోవడం బెటర్ అని ఎద్దేవా చేశారు.

somu veerraju
Chandrababu
cm ramesh
Sujana Chowdary
steel plant
railway zone
  • Loading...

More Telugu News