Siddipet District: సిద్ధిపేట ఎల్లమ్మ కన్నీరు కారుస్తోందట... తండోపతండాలుగా భక్తులు!

  • రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ముంపు గ్రామమైన చంద్లాపూర్
  • రేణుకా ఎల్లమ్మ తల్లికి బాధ కలిగిందట
  • రెండు రోజులుగా కన్నీరు వస్తోందని ప్రచారం

సిద్ధిపేట ఎల్లమ్మ కన్నీరు కారుస్తున్నదట. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జిల్లా పరిధిలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలోని విగ్రహం నుంచి గత రెండు రోజులుగా కన్నీరు వస్తోందని ప్రచారం సాగుతోంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా, చంద్లాపూర్ గ్రామం ముంపు గ్రామమైంది. దీంతో అమ్మకు బాధకలిగిందని, అందువల్లే రేణుక ఎల్లమ్మ తల్లి ఏడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Siddipet District
Chandlapur
Renuka Ellamma
Tears
  • Loading...

More Telugu News