hyderabad: జీడిమెట్ల-షాపూర్ నగర్ రహదారిపై కుంగిన రోడ్డు

  • ఇటీవలే గోదావరి నీటి కోసం పైపు లైన్ పనులు
  • నిర్లక్ష్యంగా గుంతలను పూడ్చిన వైనం
  • కుంగిపోయిన రోడ్డు

హైదరాబాదులో పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై ప్రయాణించేందుకు వాహనదారులు భీతిల్లుతున్నారు. తాజాగా హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లోని జీడిమెట్ల-షాపూర్ నగర్ రహదారిపై రోడ్డు కుంగిపోయింది. ఇటీవలే ఆ రోడ్డుపై గోదావరి నీటి కోసం పైప్ లైన్ వేశారు. అయితే, నిర్లక్ష్యంగా ఆ గుంతలను పూడ్చడంతో... రోడ్డు కుంగిపోయింది. విషయం తెలిసిన వెంటనే జీడిమెట్ల సీఐ శంకర్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకుని... వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డు కుంగిపోయిన ప్రాంతంలో తాత్కాలికంగా బ్యారికేడ్లను అడ్డుగా ఉంచారు.

  • Loading...

More Telugu News