Telugudesam: బరువు తగ్గడానికే దీక్షలంటున్న తెలుగుదేశం ఎంపీలు... వీడియో వైరల్... చూడండి!

  • టీడీపీ ఎంపీల మధ్య జోకులు
  • 5 కేజీలు తగ్గాలనుకుంటున్నట్టు చెప్పిన మురళీ మోహన్
  • వారం రోజుల దీక్షకు ఓకేనని వ్యాఖ్య

బరువు తగ్గాలంటే దీక్షలకు దిగాలట... తెలుగుదేశం ఎంపీలు న్యూఢిల్లీలో సమావేశమైన వేళ వారి మధ్య పేలిన జోకులు, సెటైర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను ఐదు కేజీల వరకూ బరువు తగ్గాలని అనుకుంటున్నట్టు చెప్పిన మురళీమోహన్, ఓ వారం రోజుల పాటు దీక్షలో కూర్చోగలనని అన్నారు. ఆ వెంటనే కల్పించుకున్న దివాకర్ రెడ్డి, 'ఈయన్ను పెడదాం... డన్' అంటూ సెటైర్ వేశారు.

ఆ వెంటనే మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకుంటూ, "ఆయన్ను మొదటి రోజే రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లాం... ఈయనెందుకు?" అని అన్నారు. రవీంద్రకుమార్ ఈ మాటనగానే అక్కడే ఉన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు 'అదేకదా' అని అనడంతో ఎంపీల మధ్య నవ్వులు విరబూశాయి. ఇదే వీడియోలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ "జోనూ లేదు గీనూ లేదు" అని వ్యాఖ్యానించడం వినిపించింది. ఈ మీటింగ్ లో ఎంపీలు కేసినేని నాని, బుట్టా రేణుక తదితరులు కూడా కనిపిస్తున్నారు.

Telugudesam
MPS
Hunger Strike
  • Error fetching data: Network response was not ok

More Telugu News